ETV Bharat / business

సానుకూల పవనాలతో బుల్​ జోరు.. సెన్సెెక్స్ 1000 ప్లస్ - స్టాక్ మార్కెట్ సెన్సెక్స్

STOCK MARKET LIVE UPDATES
STOCK MARKET LIVE UPDATES
author img

By

Published : Mar 17, 2022, 9:18 AM IST

Updated : Mar 17, 2022, 3:38 PM IST

15:36 March 17

మార్కెట్లకు భారీ లాభాలు

ఉక్రెయిన్​, రష్యా యుద్ధ భయం ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానూకూల పవనాలుతో దేశీయ స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు తర్వాత అక్కడి మార్కెట్లు రాణించటమూ కలిసొచ్చినట్లు తెలుస్తోంది. ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులకు మొగ్గచూపడమూ సానుకూలంగా మారింది. గడిచిన ఎనిమిది సెషన్లలో సెన్సెక్స్​ ఏకంగా 5వేలకుపైగా పాయింట్లు పుంజుకోవటం వల్ల మదుపర్ల సంపద రూ.19 లక్షల కోట్లు పెరిగింది.

ముంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 1047 పాయింట్ల లాభంతో 57,864 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా.. 57,620 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​.. తొలుత స్వల్ప ఒడుదొడుకులకు లోనైంది. ఒక దశలో 57, 518 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయి.. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపటం వల్ల పుంజుకుంది. 58,095 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి 57,864 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 311 పాయింట్ల వృద్ధితో 17,287 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ.. 17,202 పాయింట్ల వద్ద ప్రారంభమవగా.. ఒకానొక దశలో 17,175 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి.. మళ్లీ పుంజుకుంది. 17,344 పాయింట్ల గరిష్ఠాన్ని చేరుకుని చివరకు 17,287 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి...

హెచ్​డీఎఫ్​సీ​, జేఎస్​ డబ్ల్యూ స్టీల్​, టైటాన్​ కంపెనీ, ఎస్​బీఐ బీమా, కొటక్​ మహీంద్రా, ఏషియన్​ పెయింట్స్​, రిలయన్స్​, టాటా స్టీల్​, మారుతీలు సుమారు 3 శాతానికిపైగా లాభపడ్డాయి.

ఇన్ఫోసిస్​, సిప్లా, కోల్​ ఇండియా, ఐఓసీ, హెచ్​సీఎల్​ టెక్​లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

10:09 March 17

అంతర్జాతీయ సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం 1023 పాయింట్ల వృద్ధితో 57,850 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్​లోని అన్ని షేర్లు లాభాల్లోనే ఉన్నాయి.

అటు, నిఫ్టీ 286 పాయింట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం 17,262 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు తర్వాత అక్కడి మార్కెట్లు రాణించడం వల్ల.. దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులకు మొగ్గుచూపడం వల్ల మార్కెట్లు రాణిస్తున్నాయి.

09:05 March 17

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెెక్స్ 800 ప్లస్

STOCK MARKET LIVE: స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా వృద్ధి చెందింది. ప్రస్తుతం 57,625 వద్ద కదలాడుతోంది.

నిఫ్టీ సైతం లాభాలతోనే సెషన్​ను ప్రారంభించింది. 237 పాయింట్లు ఎగబాకి.. 17,213 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Mar 17, 2022, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.