నిఫ్టీ 110 ప్లస్
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ దాదాపు 420 పాయింట్లు బలపడి 44,567 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లకుపైగా పెరిగి 13,081 వద్ద కొనసాగుతోంది.
ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. నవంబర్‌లో వాహన విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఆటో షేర్లూ లాభాల్లో ఉన్నాయి.
- సన్‌ఫార్మా (4.3 శాతం) ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.