ప్రారంభంలో మంచి లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో సాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్ 8 పాయింట్లు పడిపోయి 43,874 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 8 పాయింట్లు పెరిగి 12,851 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో..
ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ , రిలయన్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ లాభాల్లో ఉన్నాయి.
భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ వెకబడ్డాయి.
ఆసియా మార్కెట్లు..
షాంఘై, దక్షిణ కొరియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హాంకాంగ్ మార్కెట్ నష్టాల్లో ఉంది.
చమురు..
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ చమురు ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్కు 45.25 డాలర్ల వద్ద కొనసాగుతోంది.