stock market closing today: స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. సోమవారం కుప్పకూలిన సూచీలు తాజా సెషన్లో భారీ లాభాలను నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా వృద్ధి చెందింది. ఓ దశలో 1,806 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్... చివరకు 1736 పాయింట్లు ఎగబాకి 58,142 వద్ద స్థిరపడింది.
sensex nifty closing
సెన్సెక్స్ 30 షేర్లలో అన్నీ లాభాల్లోనే పయనించాయి. బజాజ్ ఫైనాన్స్ ట్విన్ షేర్లు సెన్సెక్స్‌ను నడిపించాయి. అత్యధికంగా బజాజ్ ఫైనాన్స్ 5.51 శాతం లాభపడగా, ఎస్బీఐ 4.56 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 4.5 శాతం లాభాలను నమోదు చేశాయి. టైటాన్, ఎల్ అండ్ టీ, కోటక్ బ్యాంక్, విప్రో, టెక్ మహీంద్ర, రిలయన్స్ రాణించాయి.
నిఫ్టీ సైతం భారీ లాభాలను నమోదు చేసింది. 509 పాయింట్లు ఎగబాకింది. చివరకు 17,352 వద్ద ట్రేడింగ్ ముగించింది.
సైన్యాన్ని వెనక్కి పిలవాలని రష్యా తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాన్ని పంపింది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ వాతావరణం త్వరలోనే తొలగిపోతుందన్న ఆశలతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. వీటితో పాటు వివిధ రంగాల షేర్లన్నీ రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది.
ఇదీ చదవండి: 'బిగ్బుల్'కు పది నిమిషాల్లోనే రూ.186 కోట్ల లాభం!