ETV Bharat / business

యుద్ధ భయాలతో స్టాక్ మార్కెట్లు క్రాష్- సెన్సెక్స్ '1747' లాస్ - stock market news

Stock Market closing today: స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ పరిణామాలతో సెన్సెక్స్ 1747 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 532 పాయింట్లు కోల్పోయింది.

STOCK MARKET CLOSING TODAY
STOCK MARKET CLOSING TODAY
author img

By

Published : Feb 14, 2022, 3:41 PM IST

Share Market today closing: ఉక్రెయిన్-రష్యా యుద్ధ సంక్షోభం, చమురు ధరల మంట, అమెరికా ద్రవ్యోల్బణం.. వెరసి స్టాక్ మార్కెట్ సూచీలను పాతాళానికి నెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. ఏకంగా 1,747 పాయింట్లు నష్టపోయింది. చివరకు 56,405 వద్ద స్థిరపడింది.

30 షేర్ల సూచీలో 29 షేర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఇంతటి ప్రతికూల వాతావరణంలోనూ టీసీఎస్ షేరు రాణించింది. 0.81 శాతం లాభాలతో ట్రేడింగ్ ముగించింది.

అటు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం కుప్పకూలింది. 532 పాయింట్లు పతనమైంది. చివరకు 16,842 వద్ద ముగిసింది.

నష్టాలకు కారణాలివే!

Stock Market crash reasons:

ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్​పై రష్యా యుద్ధానికి తెగబడనుందన్న అమెరికా హెచ్చరికలు మదుపరులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. రష్యాతో అమెరికా సంప్రదింపులు జరిపినా పరిస్థితి తీవ్రత తగ్గకపోవడం మరింత అనిశ్చితికి దారి తీసింది.

చమురు ధరల మంట

మరోవైపు, చమురుల ధరలు భగ్గుమంటున్నాయి. బ్యారెల్ ముడి చమురు 95 డాలర్ల సమీపంలో ఉంది. వంద డాలర్ల మైలురాయి దిశగా దూసుకెళ్తోంది.

ద్రవ్యోల్బణం..

అమెరికా విడుదల చేసిన వివరాల ప్రకారం ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా ఉండటం.. ఫలితంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాలు మదుపర్లలో కొనసాగాయి. అటు అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు దేశీయ మదుపర్లపై ప్రభావం చూపాయి.

ఇదీ చదవండి: వరుస రెండో నెలలోనూ తగ్గిన టోకు ద్రవ్యోల్బణం.. కానీ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.