stock market closing today: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సైతం ఒడుదొడుకుల మధ్య ప్రయాణం సాగించాయి. తొలుత లాభాలతోనే ప్రారంభమైన సూచీలు.. ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్ష సమావేశంలో రేట్ల పెంపు తప్పదన్న సంకేతాలు, అంతర్జాతీయ కారణాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం పలు రంగాల షేర్లు కోలుకోవడం వల్ల.. మార్కెట్లు పుంజుకున్నాయి.
Sensex today closing
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. మంగళవారం సెషన్లో 187 పాయింట్లు లాభపడింది. 150 పాయింట్ల వృద్ధితో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్.. ఓ దశలో 500 పాయింట్లకు పైగా పతనమైంది. అనంతరం పుంజుకొని.. 57,808 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 షేర్లలో టాటా స్టీల్ అత్యధికంగా 3 శాతానికి పైగా వృద్ధి సాధించింది. బజాజ్ ఫైనాన్స్, టైటాన్, రిలయన్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, మారుతి షేర్లు రాణించాయి. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టపోయాయి.
Nifty closing news
అటు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ సైతం ఒడుదొడుకులు ఎదుర్కొని.. అనంతరం తేరుకుంది. చివరకు 53 పాయింట్ల లాభంతో 17,266 వద్ద ట్రేడింగ్ ముగించింది.
ఒడుదొడుకులకు కారణాలు
- ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుందన్న ఊహాగానాలు
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ పవనాలు
- ముడి చమురు ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరడం
- విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగడం
- ఇటీవల విడుదలైన పలు సంస్థల త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉండటం.
ఇదీ చదవండి: కశ్మీర్ ఇష్యూలో హ్యుందాయ్ క్షమాపణలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు