ETV Bharat / business

Stock Market: వరుస నష్టాలకు బ్రేక్​.. సెన్సెక్స్​ 110 ప్లస్​ - దేశీయ సూచీలు

Stock Market: వరుసగా నాలుగు సెషన్ల పతనం అనంతరం భారత స్టాక్​ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 57 వేల 900 ఎగువకు చేరింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగింది.

Stock Market
Stock Market
author img

By

Published : Dec 16, 2021, 3:39 PM IST

Stock Market: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగాయి. ఆరంభంలో భారీ లాభాలు నమోదు చేసినప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆఖరి గంటలో మళ్లీ కొనుగోళ్ల ఊతంతో సూచీలు లాభాల్లో ముగిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 113 పాయింట్లు పెరిగింది. 57 వేల 901 వద్ద సెషన్​ను ముగించింది.

సెషన్​ ఆరంభంలో సెన్సెక్స్​ ఓ దశలో 540 పాయింట్లకుపైగా పెరగడం విశేషం. 58 వేల 337 వద్ద సెషన్​ గరిష్ఠాన్ని తాకింది. కొద్దిసేపటికి 100 పాయింట్ల నష్టంతో 57 వేల 683 పాయింట్ల కనిష్ఠస్థాయికి చేరింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో.. 17 వేల 248 వద్ద స్థిరపడింది.

ఐటీ, ఆయిల్​ అండ్​ గ్యాస్​ రంగం షేర్లు రాణించాయి. విద్యుత్తు, ఆర్థిక, రియల్టీ, బ్యాంకింగ్​, ఫార్మా రంగం షేర్లు డీలా పడిపోయాయి.

లాభనష్టాల్లో..

బజాజ్​ ఫినాన్స్​, ఇన్ఫోసిస్​, బీపీసీఎల్​, విప్రో, టైటాన్​ కంపెనీ నేటి ట్రేడింగ్​లో లాభాలను నమోదు చేశాయి.

హిందాల్కో, సిప్లా, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్​, హీరో మోటోకార్ప్​ అత్యధికంగా నష్టపోయాయి.

US Fed Meeting Outcome: అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ ప్రకటన సానుకూలంగా ఉండటం వల్ల అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

ఇవీ చూడండి: ఆ బ్యాంకులకు ఆర్​బీఐ షాక్- రూ.కోటికి పైగా జరిమానా​!

బ్యాంకులు బంద్- ఆ లావాదేవీలపై ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.