Stock Market Today: స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది ఆఖరు సెషన్‌ను లాభాలతో ముగించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 460 పాయింట్లు పెరిగి.. 58,254 వద్ద స్థిరపడింది. మరో సూచీ జాతీయ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి.. 17,354 వద్ద ముగిసింది.
బ్యాంకింగ్, ఆటో, లోహ సహా అన్ని రంగాల షేర్లు రాణించడం వల్ల సూచీలు 2021 ఏడాదిలో చివరి సెషన్‌ను సానుకూలంగా ముగించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ ఉదయం 57,850 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 58,409 వద్ద అత్యధిక స్థాయి.. 57,846 పాయింట్ల వద్ద అత్యల్ప స్థాయిని తాకింది.
ఉదయం 17,244 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన నిఫ్టీ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 17,238 కనిష్ఠ స్థాయి.. 17,401 వద్ద గరిష్ఠ స్థాయి మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివివే..
సెన్సెక్స్ ముప్పై షేర్లలో ఎన్టీపీసీ, టెక్‌మహీంద్రా, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ మినహా అన్ని షేర్లు లాభాలు గడించాయి.
ఇదీ చూడండి: Financial Planning for 2022: కొత్త ఏడాదికి ఆర్థిక ప్రణాళిక వేసుకోండిలా..!