Stock Market Closing: ఆసియా మార్కెట్లలో మిశ్రమ పరిస్థితులున్నా.. దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాలు నమోదుచేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 143 పాయింట్లు పెరిగింది. చివరకు 59 వేల 745 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో.. 17 వేల 813 వద్ద సెషన్‌ను ముగించింది.
ఆరంభంలో 500 పాయింట్లకుపైగా లాభంతో ట్రేడయిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ కాసేపటికే ఒడుదొడుకులకు లోనయింది. ఇంట్రాడేలో నష్టాల బాటలో నడిచింది. ఒక దశలో 530 పాయింట్లు పెరిగి.. 60 వేల 130 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. మళ్లీ 200 పాయింట్లు నష్టపోయి 59 వేల 401 వద్ద సెషన్ కనిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 140 పాయింట్లు పెరిగింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ దాదాపు 5 శాతం లాభపడింది. ఓఎన్జీసీ, హిందాల్కో, శ్రీ సిమెంట్స్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభాల జాబితాలో ఉన్నాయి.
బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ డీలాపడ్డాయి.
ఇవీ చూడండి: క్విక్ కామర్స్‌లోకి రిలయన్స్ ఎంట్రీ- డుంజోలో 25.8% వాటా సొంతం
JIO Disney plus Hotstar Plan: డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్లాన్