అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (సెన్సెక్స్) 329 పాయింట్లు లాభపడి 35,171 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (నిఫ్టీ) 94 పాయింట్లు పెరిగి 10,383 పాయింట్లకు చేరింది.
ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు వంటి హెవీ వెయిట్ షేర్ల దూకుడు స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది.
లాభనష్టాల్లోనివి..
ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా నష్టాల్లోకి జారుకున్నాయి.