అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో దేశీయ మార్కెట్లు లాభాలబాట పట్టాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ సానుకూలంగా ముగించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 264 పాయింట్లు వృద్ధి చెంది... 37,332 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 11,023 వద్ద ముగించింది.
ఒక దశలో సెన్సెక్స్ 220 పాయింట్లకు పైగా పతనమైంది. అయితే చివరి గంటల్లో బ్యాంకింగ్, ఆటో, లోహ, ఫార్మా, ఐటీ రంగాల షేర్లు రాణించడం వల్ల సూచీలు కోలుకున్నాయి.
లాభాల్లో...
ఎస్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటాస్టీల్, వేదాంత, టాటా మోటర్స్ షేర్లు లాభపడ్డాయి.
నష్టాల్లో...
పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ షేర్లు నష్టపోయాయి.
రూపాయి...
డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు కోలుకుని 71.55గా ఉంది
దిగిన బంగారం...
నిన్న రూ.40,000 వేల మార్కును అందుకున్న పసిడి ధర రూ.500 తగ్గింది. 10 గ్రాముల ఖరీదు రూ.39,720గా ఉంది.
- ఇదీ చూడండి: కేబుల్ బిల్ భారం బేఖాతరు.. వినోదానికే జై!