దేశీయ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. లాక్డౌన్ ఆంక్షల సడలింపు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతతో మదుపురులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 880 పాయింట్ల వృద్ధితో 33,303 వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 9,826 పాయింట్ల వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి..
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్ కంపెనీ, టాటాస్టీల్, ఎం&ఎం సంస్థలు లాభాల్లో దూసుకెళ్లాయి.
డా.రెడ్డీస్ ల్యాబ్స్, భారతి ఇన్ఫ్రాటెల్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్టిల్, సన్ ఫార్మాలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోలిస్తే 7 పైసలు క్షీణించి 75.54 వద్ద అమ్ముడవుతోంది.