స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. రిలయన్స్ షేర్ల రికార్డు ముగింపు, అంతర్జాతీయంగా సానుకూలతల ప్రభావం సూచీలపై కనిపించింది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 99 పాయింట్లు లాభపడి 36,693 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 34 పాయింట్లు వృద్ధి చెంది 10,802కు చేరింది.
రిలయన్స్ షేర్ల హవా...
తమ సంస్థంలో క్వాల్కమ్ కంపెనీ రూ. 730కోట్ల పెట్టుబడులు పెడుతోందని రిలయన్స్ ఆదివారం ప్రకటించింది. ఫలితంగా సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు.. 3శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో ముగిశాయి.
లాభనష్టాల్లోనివి ఇవే...
టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనివర్ లివర్, ఐటీసీ, సన్‌ఫార్మా, టాటా స్టీల్ లాభాల బాటపట్టాయి.
టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్టీ, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోయాయి.
రూపాయి...
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.75.19 వద్ద స్థిరపడింది.
చమురు...
అంతర్జాతీయ విపణిలో చమురు ధర 1.25 శాతం తగ్గి 42.70 డాలర్ల వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి:- 2020-21లో దేశ వృద్ధి రేటు -4.5 శాతం!