దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 350 పాయింట్లు బలపడి 39,887.97 వద్ద కొనసాగుతోంది. 76.25 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 11,946.90 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలతో ఐటీ, బ్యాంకింగ్ రంగాలు పరుగులు పెడుతున్నాయి.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.23 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లోనివి
టాటా స్టీల్, జీ ఎంటర్టైన్, ఇండియా బుల్స్ హౌసింగ్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండియా సిమెంట్స్ లాభాల్లో సాగుతున్నాయి.
నష్టాల్లోనివి
రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా, పీసీ జువెలర్స్, జె అండ్ కె బ్యాంక్ నష్టాల బాట పట్టాయి.
ఇదీ చూడండి: 'పన్నులు తగ్గించాలి.. ప్రోత్సాహకాలు అందించాలి'