స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ (Sensex today) 123 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠ స్థాయి అయిన 53,493 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 36 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 16,294 వద్దకు చేరింది.
లాభాల స్వీకరణ కారణంగా ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. ఐటీ, హెవీ వెయిట్ షేర్ల దన్నుతో తిరిగి లాభాలను గడించాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 54,717 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవితకాల గరిష్ఠం) 54,230 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,349 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 16,210 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెచ్‌సీఎల్‌టెక్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ ఎక్కువగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో నిక్కీ (జపాన్).. మినహా.. షాంఘై (చైనా), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు నష్టాలతో ముగిశాయి.
ఇదీ చదవండి: గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..