దేశీయ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(bse sensex today live) 112 పాయింట్లు కోల్పోయి 60,433 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ(nifty today live) 24 పాయింట్లు పతనమై 18,044 వద్ద స్థిరపడింది.
ఎఫ్ఎమ్సీజీ, లోహ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఆటోమొబైల్ రంగం షేర్లు లాభపడ్డాయి.
ఇంట్రాడే సాగిందిలా..
దేశీయ సూచీల ఇంట్రాడే సెషన్ ఒడిదొడుకుల మధ్య సాగింది.
ఉదయం 60,609 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్.. 60,213 కనిష్ఠాన్ని తాకింది. తిరిగి పుంజుకుని 60,670 గరిష్ఠాన్ని చేరుకుంది. మొత్తం మీద 112 పాయింట్లు నష్టపోయి 60,433 వద్ద ముగిసింది.
18,084 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన నిఫ్టీ.. 18,112 గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి నష్టాల్లోకి జారుకుంది. 17,983 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసి, చివరికి 24 పాయింట్ల నష్టంతో 18,044 వద్ద స్థిరపడింది.
లాభనష్టాలు..
టాటా మోటర్స్, ఎం అండ్ ఎం, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ షేర్లు లాభాలు గడించాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టాటాస్టీల్, మారుతి, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, బ్రిటానియా షేర్లు నష్టాపోయాయి.
ఇదీ చూడండి:- ట్విట్టర్ పోల్కే 'మస్క్' సై- టెస్లా వాటా విక్రయానికి సిద్ధం