స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ పాయింట్ల లాభంతో 54,844 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 16,364 వద్దకు చేరింది.
ఐటీ, బ్యాంకింగ్, పవర్ గ్రిడ్ వంటి షేర్ల సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 54,862 పాయింట్ల అత్యధిక స్థాయి, 54,536 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,375 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,286 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
పవర్ గ్రిడ్, టెక్ మహీంద్ర, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్, ఎల్&టీ లాభాలను గడించాయి.
ఐచర్మోటార్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ఐఓసీ, ఓఎన్జీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: దేశంలో పెరుగుతున్న విమానయాన ప్రయాణికులు
ఇదీ చూడండి: భారీగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?