ఒడుదొడుకుల సెషన్‌ను చివరకు స్వల్ప లాభాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. బీఎస్ఈ- సెన్సెక్స్ (Sensex today) 125 పాయింట్లు పెరిగి 54,403 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 20 పాయింట్ల లాభంతో 16,258 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు.. ఒడుదొడుకులకు కారణంగా తెలుస్తోంది. అయితే వాహన, బ్యాంకింగ్ షేర్లు సానుకూలంగా స్పందించడం వల్ల మార్కెట్లు లాభాలను గడించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 54,584 పాయింట్ల అత్యధిక స్థాయి, 54,124 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,320 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,179 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎం&ఎం, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాలను గడించాయి.
భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఎల్&టీ, ఎన్టీపీసీ, బజాజ్ ఫినాన్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలతో ముగిశాయి. కోస్పీ (దక్షిణ కొరియా) సూచీ నష్టాలను గడించింది.
ఇదీ చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్- అందుకు సుప్రీం నో!