అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ట్రంప్ సానుకూల ప్రకటనతో ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్ల పతనంతో నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచి, వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన క్రమంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించటమూ నష్టాలకు దారి తీసింది. నిఫ్టీ 12 వేల మార్కును కోల్పోయింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 334 పాయింట్లు నష్టపోయిం 40,445 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ- 97 పాయింట్లు క్షీణించి 11, 921 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివి..
ప్రైవేట్ రంగం రుణదాతల రేటింగ్‌ను మూడీస్ సంస్థ తగ్గించిన క్రమంలో ఎస్ బ్యాంకు 10 శాతం మేర నష్టపోయింది. ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటర్స్, మహీంద్ర&మహీంద్ర , హెచ్డీఎఫ్సీ నష్టాలు మూటగట్టుకున్నాయి.
కొటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఆర్ఐఎల్, ఏషియన్ పేయింట్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే.. 10 పైసలు క్షీణించి రూ. 71.30 వద్దకు చేరింది.
ఇదీ చూడండి: అలా అయితే వొడాఫోన్-ఐడియా మూసివేతే: బిర్లా