రెండు రోజులు భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 497 పాయింట్లు బలపడి.. 56,319 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 156 పాయింట్ల లాభపడి.. 16,771 వద్ద ముగిసింది.
ఐటీ, లోహ దన్నుతో సూచీలు లాభపడ్డాయి.
ఇంట్రాడే సాగిందిలా..
56,320 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ లాభాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 56,047 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. కీలక రంగాల్లో మద్దతుతో ఒక దశలో 1000 పాయింట్లకు పైగా పుంజుకుని 56,900.74 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.
నిఫ్టీ.. ఉదయం 16,773 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఒకనొక దశలో 16,688 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది.
లాభనష్టాల్లోని ఇవే..
ముప్పై షేర్ల ఇండెక్స్‌లో... పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్‌ఫైనాన్స్, ఎస్బీఐఎన్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ, కొటక్బ్యాంకు నష్టాల్లో ముగిశాయి.
ఇదీ చదవండి: ఆ జాబితాలో రిలయన్స్‌కు అగ్రస్థానం!