భారీగా పతనమైన రూపాయి
రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. 65 పైసలు పడిపోయిన రూపాయి.. డాలరుతో పోలిస్తే 73.99కు చేరుకుంది. అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనతో విదేశీ నిధులు తరలిపోవటం వల్ల రూపాయి పతనమైంది.
మూలధన విపణుల్లోనుంచి విదేశీ మారక నిల్వలను తరలించటం, విదేశీ సంస్థాగత మదుపరులు ఈక్విటీల అమ్మకాలు రూపాయి పతనాన్ని శాసించాయి.
స్టాక్ మార్కెట్లు ప్రారంభ సెషన్లో 3 శాతం మేర నష్టపోవటమూ రూపాయిపై ప్రభావం చూపింది. కరోనా భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టోవటం వల్ల దేశీయ మదుపరుల సెంటిమెంటు దెబ్బతిన్నది. యెస్ బ్యాంక్‌పై మారటోరియం విధించటం వల్ల స్టాక్ మార్కెట్లపై మరింత భారం పడింది.
డాలరు కూడా..
కరోనా వైరస్ ప్రభావం వృద్ధిపై తప్పకుండా పడుతుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన నేపథ్యంలో డాలరు విలువ కూడా 0.25 శాతం పడిపోయింది.