ETV Bharat / business

రూ.55 వేల కోట్లు తగ్గిన రిలయన్స్‌ మార్కెట్‌ విలువ! - మార్కెట్‌ విలువ ఆధారంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

గతవారం మార్కెట్​ ఒడుదొడుకులతో పలు కంపెనీల షేర్లు ఆమాంతం పడిపోయాయి. దేశీయంగా అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్​ మార్కెట్ విలువ రూ.55 వేల కోట్లు తగ్గింది. వీటితో పాటు అత్యంత విలువ కలిగిన తొలి పది సంస్థల్లో ఏడింటి విలువ రూ.1,07,566.64 కోట్లు తగ్గడం గమనార్హం.

Reliance market value down by Rs 55,000 crore
రూ.55 వేల కోట్లు తగ్గిన రిలయన్స్‌ మార్కెట్‌ విలువ!
author img

By

Published : Mar 28, 2021, 12:27 PM IST

స్టాక్‌ మార్కెట్​లో నమోదైన కంపెనీల్లో అత్యంత విలువ కలిగిన తొలి పది సంస్థల్లో ఏడింటి విలువ గతవారం గణనీయంగా పడిపోయింది. గడిచిన వారం రోజుల్లో ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,07,566.64 కోట్లు తగ్గింది. మార్కెట్‌ నష్టపోయిన సొమ్ములో సగం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిందే కావడం గమనార్హం. గత వారం సెన్సెక్స్‌ 849.74 పాయింట్లు కోల్పోయింది. టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే లాభాల్ని ఆర్జించగలిగాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.55,565.21 కోట్లు తగ్గి 12,64,243.20 కోట్లకు చేరింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలువ రూ.2,408.22 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ విలువ రూ.5,467.63 కోట్లు, ఇన్ఫోసిస్‌ రూ.3,751.92 కోట్లు, టీసీఎస్‌ రూ.12,420.4 కోట్లు, ఎస్‌బీఐ విలువ రూ.12,494.45 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.6,313.77 కోట్లు, బజాజ్‌ ఫినాన్స్‌ రూ.16,197.55 కోట్లు, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ విలువ రూ.11,681.66 కోట్లు కుంగింది. ఇక వీటిని భిన్నంగా హెచ్‌యూఎల్‌ రూ.364.19 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.62.77 కోట్లు, టీసీఎస్‌ తమ మార్కెట్‌ విలువకు రూ.1,812.54 కోట్లు జోడించాయి.

ఇక మార్కెట్‌ విలువ ఆధారంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తొలి స్థానాన్ని నిలబెట్టుకోగా.. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: 'ఆ కంపెనీలతోనే లాభాల పంట'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.