ETV Bharat / business

'ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ముప్పు- భారత్​కూ ఇబ్బందే '

author img

By

Published : Mar 27, 2020, 10:42 AM IST

ప్రపంచంలోని అనేక దేశాలు కరోనా దెబ్బకు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే ప్రమాదముందని అంచనా వేశారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్. ఈ పరిణామం భారత్​పైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషించారు.

RBI Governor Shaktikanta Das
'ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ముప్పు- భారత్​కూ ఇబ్బందే '

కరోనా సంక్షోభం... ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. 2019లో దశాబ్దపు కనిష్ఠానికి ప్రపంచ వృద్ధి రేటు పతనం కావడాన్ని గుర్తుచేశారు. 2020లో వృద్ధి కొంతైనా పుంజుకుంటుందన్న ఆశలు ఇప్పుడు ఆవిరైపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.

కరోనా వ్యాప్తి తీవ్రత, వేగం, ఎంత కాలం ఈ మహమ్మారి కొనసాగుతుందన్న అంశాలపైనే... ప్రపంచ ఆర్థిక భవిత ఆధారపడి ఉంటుందని విశ్లేషించారు ఆర్​బీఐ గవర్నర్. ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయే ప్రమాదముందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం.. భారత్​పైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు శక్తికాంత దాస్. అయితే... ముడి చమురు ధరల తగ్గుదల మాత్రమే మనకు లాభించే అంశం అవుతుందని చెప్పారు.

ఇదీ చదవండి...

ఆర్​బీఐ కీలక నిర్ణయం- రెపోరేటు 75బేసిస్​ పాయింట్లు తగ్గింపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.