రాష్ట్రంలోని ఐదు జిల్లాలో పెట్రోల్ ధరలు(Petrol Price) రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. నిజామాబాద్. ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది.
పెట్రోల్ ధర(Petrol Price) రూ. వంద దాటడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే... కేంద్రం పెట్రో భారం మోపడం దారుణమన్నారు.
ఆయా జిల్లాల్లో పెట్రోల్ ధరలు (Petrol Price) :
జిల్లా పేరు | పెట్రోల్ ధర(లీ.కు) |
నిజామాబాద్ | రూ.100.17 |
ఆదిలాబాద్ | రూ.100.45 |
గద్వాల్‌లో | రూ.100.45 |
ఆసిఫాబాద్ | రూ.100.11 |
నిర్మల్‌లో | రూ.100.03 |
- ఇదీ చదవండి : తెలుగు రాష్ట్రాల హోంశాఖలపై తెలంగాణ హైకోర్టు అసహనం