ETV Bharat / business

త్రైమాసిక ఫలితాలు.. కరోనా వార్తలే కీలకం! - Stocks live

కరోనా సంబంధిత వార్తలు, త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలే ఈ వారం మార్కెట్లను ముందుకు నడపనున్నాయి. మార్కెట్లపై రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏమాత్రం ప్రభావం చూపవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Markets, outlook
త్రైమాసిక ఫలితాలు, కరోనా వార్తలే కీలకం!
author img

By

Published : May 2, 2021, 4:17 PM IST

త్రైమాసిక ఫలితాలు, కరోనా సంబంధిత వార్తలు, మైక్రోఎకనమిక్​ డేటా ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. పలు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కట్టడి చేస్తాయనేది నిర్ణయాత్మక అంశం అవుతుందని తెలిపారు.

"ఎన్నికల ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం చాలా తక్కువ. ఆ వార్తల విలువ కొన్ని గంటలకు మించి ఉండదు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా కట్టడి చేస్తాయనేది ప్రధానాంశంగా ఉంది. కేసులను కట్టడి చేయడానికి లాక్​డౌన్​ ప్రకటిస్తే అది కచ్చితంగా మార్కెట్​కు భారీ నష్టాలను మిగుల్చుతుంది."

-వీకే విజయ్​ కుమార్​, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్

"ఈ వారం మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యే ఆవకాశం ఉంది. ఇందుకు పెరుగుతున్న కరోనా కేసులే కారణం. శుక్రవారం మార్కెట్​లు ముగిసే సమయానికి రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఫలితాలు వచ్చాయి. సోమవారం ప్రారంభ సెషన్​లో మదుపరులు రిలయన్స్​పై దృష్టి సారించే అవకాశం ఉంది. "

అజిత్​ మిశ్రా, రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్

ఎకానమికి సంబంధించిన డేటా, తయారీ రంగం పీఎంఐ లాంటివి ఈ వారంలో విడుదల కానున్నాయి. అదానీ గ్రూప్​కు సంబంధించిన కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారమే విడుదల కానున్నాయి.

ఇవీ చూడండి:

వడ్డీ రేట్లపై ఎస్​బీఐ కీలక ప్రకటన!

ఏప్రిల్​లో ఎగుమతులు పెరిగినా.. వాణిజ్య లోటు 120%

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.