దేశీయ మార్కెట్ల సూచీలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఉదయం 175 పాయింట్లు కోల్పోయిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ... ప్రస్తుతం లాభనష్టాలతో దోబూచులాడుతోంది. 38వేల 980 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 11 వేల 555 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు ఐటీ, బ్యాంకింగ్ రంగాలపై ప్రభావం చూపుడుతున్నాయి. అమెరికా సభలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమయ్యారు.
లాభనష్టాల్లో...
ఐటీసీ, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ 2 శాతం లాభపడ్డాయి.
ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, నెస్లే, వేదాంత, గెయిల్, ఐసిఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, కొటక్ మహింద్రా బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ 3 శాతం నష్టపోయాయి.
జపాన్, హాంకాంగ్, షాంఘై మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. అమెరికా మార్కెట్లు కూడా బుధవారం నష్టపోయాయి.
ఇదీ చూడండి: భారత్‌లో శాంసంగ్ మడత ఫోన్ ధరెంతో తెలుసా!