స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆర్థిక వృద్ధి మరింత తగ్గుతుందన్న ఆర్బీఐ అంచనాల నేపథ్యంలో మదుపరులు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ - సెన్సెక్స్ 150 పాయింట్లు కోల్పోయింది. 39 వేల 375 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ- నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 11 వేల 795 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే...
వేదాంత, విప్రో, ఇండియా బుల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల జాబితాలో ఉన్నాయి.
రెడ్డీస్ ల్యాబ్య్, సిప్లా, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.