రెండోసారి వరుసగా కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం రేపు బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. బడ్జెట్‌పై సానుకూల అంచనాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 120 పాయింట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం 39,960 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 11,954 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
లాభాల్లో..
ఇండియా బుల్స్, యూపీఎల్, కోటక్ మహీంద్ర, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
నష్టాల్లో..
టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, విప్రో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి, ముడి చమురు
నేటి ట్రేడింగ్‌లో రూపాయి 9 పైసలు మెరుగైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68.82 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 63.34 వద్ద కొనసాగుతోంది.
- ఇదీ చూడండి: పద్దు 2019: ఆరోగ్య భారతం ఇంకెంత దూరం?