ETV Bharat / business

రికార్డు నష్టాల నుంచి తేరుకొని భారీ లాభాల్లోకి

దేశీయ స్టాక్​మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఆరంభ ట్రేడింగ్​లో భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్​మార్కెట్లు ట్రేడింగ్​ పున:ప్రారంభం అనంతరం జోరందుకున్నాయి. సెన్సెక్స్​ 1,325 , నిఫ్టీ 365 పాయింట్లు పెరిగాయి.

Market Live: Indices report biggest intra-day recovery, Nifty below mount 10K
రికార్డు నష్టాల నుంచి తేరుకున్న మార్కెట్లు
author img

By

Published : Mar 13, 2020, 3:46 PM IST

వరుస నష్టాల అనంతరం.. స్టాక్​ మార్కెట్లు నేడు కోలుకున్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్​ ప్రారంభ సెషన్​లో భారీ నష్టాలు నమోదు చేసిన సూచీలు వేగంగా లాభాల్లోకి మళ్లాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 1,325 పాయింట్ల మేర లాభపడి 34,103 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 365 పాయింట్లు పెరిగి 9,955 వద్ద ట్రేడింగ్​ ముగించింది.

ట్రేడింగ్​ ఆరంభంలో రికార్డు నష్టాలతో ప్రారంభమయ్యాయి సూచీలు. తొలుత సెన్సెక్స్​ 3500 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ 10 శాతం నష్టపోయింది. ఈ సమయంలో దాదాపు 45 నిమిషాల పాటు ట్రేడింగ్​ నిలిపివేశారు. తిరిగి ప్రారంభమయ్యాక బుల్​ పరుగులు పెట్టింది. సెన్సెక్స్​ దాదాపు 5000 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 1600 పాయింట్ల మేర కోలుకుంది. ఇది రికార్డు

లాభనష్టాల్లోనివివే...

బ్యాంకింగ్ రంగం షేర్లు భారీగా లాభపడ్డాయి. ఎస్బీఐ, హెచ్​డీఎఫ్​సీ, సన్​ఫార్మా, టాటా స్టీల్​, బీపీసీఎల్​ రాణించాయి.

యూపీఎల్​, జీ ఎంటర్​టైన్​ మెంట్స్​, నెస్లే, ఏషియన్​ పెయింట్స్​, బ్రిటానియా​ డీలాపడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.