ETV Bharat / business

బుల్​ జోరు- సెన్సెక్స్ 514 పాయింట్లు వృద్ధి - బీఎస్​ఈ సెన్సెక్స్​

బుల్​ జోరుతో దేశీయ మార్కెట్లు(Stock markets) గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్(BSE Sensex)​ ఏకంగా 500లకుపైగా పాయింట్ల వృద్ధి సాధించింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది.

stocks closing
భారీ లాభాల్లో మార్కెట్లు
author img

By

Published : Sep 2, 2021, 3:42 PM IST

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు ఐటీ, ఎఫ్​ఎమ్​సీజీ షేర్ల దన్నుతో దేశీయ స్టాక్​ మార్కెట్లు(Stock markets) భారీ లాభాలను గడించాయి. ఆటో, పీఎస్​యూ బ్యాంకు షేర్లు మినహా ఇతర అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ఉన్నాయి. బీఎస్​ఈ(BSE Sensex) మిడ్​క్యాప్​, స్మాల్​ క్యాప్​ సూచీలు దాదాపు 0.5 శాతం మేర లాభపడ్డాయి.

బొంబాయి స్టాక్​ ఎక్చ్చేంజీ సూచీ సెన్సెక్స్ 514 పాయింట్ల లాభంతో 57,852 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 57,892 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ జీవిత కాల గరిష్ఠం 17,245ను తాకి చివరకు 158 పాయింట్ల లాభంతో 17,234 పాయింట్ల వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి...

శ్రీ సిమెంట్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ సుమారు 5 శాతం మేర లాభపడగా, టీసీఎస్​, సిప్లా, హెచ్​యూఎల్​ 2.5 శాతానికిపైగా వృద్ధి నమోదు చేశాయి.

ఎంఅండ్​ ఎం, కోల్​ఇండియా, ఓఎన్​జీసీ, బజాజ్​ ఆటో, టాటా మోటార్స్​ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.