దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 288 పాయింట్లు బలపడి 39,044 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 82 పాయింట్లు మెరుగై 11,522 పాయింట్లకు చేరుకుంది.
లాభనష్టాల్లో..
ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ రాణించాయి.
టైటాన్, మారుతి, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు వెనకబడ్డాయి.
ఆసియా మార్కెట్లు..
ఆసియాలో షాంఘై, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా మార్కెట్లు లాభపడగా.. జపాన్ సూచీలు నష్టాలతో ముగిశాయి.
రూపాయి మారకం..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ 16 పైసలు బలహీనపడి డాలరుతో పోలిస్తే 73.64 వద్ద స్థిరపడింది.
చమురు
బ్రెంట్ చమురు ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్‌కు 39.72 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇదీ చూడండి: 2020-21లో భారత వృద్ధి రేటు -9శాతం నమోదు!