స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 271 పాయింట్లకు పైగా లాభపడి 52,577 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 67 పాయింట్లుకు పైగా పుంజుకుని 15,753 వద్ద కొనసాగుతుంది.
వివిధ రాష్ట్రాల్లో కరోనా ఆంక్షల సడలింపు సహా.. రోజువారీ కేసుల తగ్గుదల, వేగవంతమైన టీకా కార్యక్రమంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నట్లు నిపుణులు విశ్లేషించారు. మూలధన మార్కెట్లో పెరిగిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) సైతం మార్కట్ల లాభానికి కారణమని తెలిపారు.