దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 55 పాయింట్లు నష్టపోయి 44,205 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 12,977 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో..
బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
పవర్‌గ్రిడ్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు వెనుకబడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం..
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ సూచీలపై పడింది. థ్యాంక్స్‌గివింగ్ డే సందర్భంగా అమెరికా మార్కెట్లు గురువారం మూతబడినా.. ఆసియా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఐరోపా మార్కెట్లపై గురువారం ఒత్తిడి కనిపించింది.
చమురు..
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్‌కు 47.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇదీ చూడండి: ఒక షిఫ్టు 12 గంటలు- ఎందుకంత వ్యతిరేకత?