దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 243 పాయింట్లు లాభపడి 44,766 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 71 పాయింట్లు మెరుగై 13,126 పాయింట్ల వద్దకు చేరింది.
మార్కెట్లకు ప్రధానంగా బలమైన ఎఫ్‌పీఐ ప్రవాహంతో నవంబర్‌లో దేశీయ సూచీల్లో ర్యాలీ కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ల ఫలితాలు కూడా సానుకూలంగా రావటం మార్కెట్లకు కలిసివస్తోంది.
లాభనష్టాల్లో..
ఓఎన్జీసీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్‌టెక్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫినాన్స్, నెస్లే షేర్లు వెనకబడ్డాయి.
ఆసియాలో జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా లాభాల్లో ఉండగా.. షాంఘై మార్కెట్ నష్టాల్లో ఉంది.
చమురు..
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 1.26 పెరిగి బ్యారెల్‌కు రూ.48.39 డాలర్లుగా ఉంది.