చమురు ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో పశ్చిమ ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు ప్రారంభ సెషన్లోనే కుప్పకూలాయి. కువైట్ ప్రీమియర్ సూచీ 9.5శాతం పతనం కావటం వల్ల ట్రేడింగ్‌ను నిలిపేశారు.
దుబాయి ఫైనాన్షియల్ మార్కెట్ 9శాతం, అబుదబీ సెక్యురిటీస్ ఎక్స్ఛేంజి 7.1 శాతం పడిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ ఆరాంకో షేర్లు 10 శాతం కోల్పోయాయి.
రూబుల్ పతనం..
చమురు ధరల పతనంతో రష్యా కరెన్సీ రూబుల్ కూడా భారీగా పతనమైంది. 7 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరింది. డాలరుతో పోలిస్తే రూబుల్ మారకం విలువ 74గా కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సోమవారం ఏకంగా 25 శాతం పతనాన్ని చవిచూశాయి. ఇంధన ఉత్పత్తుల విషయంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తాయి. ఫలితంగా చమురు ధరలను భారీగా తగ్గించింది సౌదీ.