పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.239 పెరిగి రూ.41,865కు చేరుకుంది.
"డాలరుతో పోలిస్తే రూపాయి 23 పైసలు పడిపోయింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయి. రెండో త్రైమాసికంలో అంచనా వేసిన రెవెన్యూ అంచనాలను చేరుకోలేమని యాపిల్ చేసిన ప్రకటనతో బంగారంవైపు మదుపరులు చూస్తున్నారు. ఫలితంగా దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.239 పెరిగింది."
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యురిటీస్ సీనియర్ విశ్లేషకులు
వెండి కూడా కిలోకు రూ.296 పెరిగి రూ.41,626 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,588 డాలర్లుగా ఉంది. వెండి ఔన్సుకు 17.88 డాలర్ల వద్ద కొనసాగుతోంది.