ప్రత్యామ్నాయ పెట్టుబడిగా పేరొందిన బంగారం గత కొద్ది రోజులుగా భారీగా దిగొస్తున్నాయి. 2020 ఆగస్టులో ఆల్ టైం హై 56 వేల మార్కును ధరను తాకిన పదిగ్రాముల ఫ్యూచర్ గోల్డ్.. మార్చి నుంచి తగ్గటం ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి 21న ఆల్ టైం తక్కువ ధర 43 వేల 320 వద్ద గోల్డ్ ట్రేడ్ అయింది. గత నెల మే 31న 50 వేల 300 వద్ద ట్రేడ్ అయిన గోల్డ్.. గత మూడు వారాల నుంచి తగ్గుతూ వస్తోంది. పదిగ్రాముల బంగారం ఇవాళ ఏకంగా 1600 పాయింట్లు మేర తగ్గి 47 వేల వద్ద ట్రేడ్ అవుతోంది. మూడు నెలల్లో ఇదే లీస్ట్ కరెక్షన్ అని నిపుణులు అంటున్నారు.
ఎంసీఎక్స్‌లో నిన్న 48 వేల 600 వద్ద ట్రేడ్ ప్రారంభమైన అయిన పదిగ్రాముల బంగారం ఒక దశలో 48 వేల 730 వరకూ వెళ్లి.. ప్రస్తుతం 47 వేల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇప్పటివరకు -2.93 కరెక్షన్ను గోల్డ్ నమోదు చేసింది. యూఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలున్నట్లు బుధవారం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సంకేతాలు, డాలర్ విలువ బలపడటం కారణంగా బంగారం ధరల పతనానికి కారణమైందని నిపుణులు తెలిపారు. ఈ నెలాఖరుకల్లా ఈ కరెక్షన్ 43 నుంచి 45 వేల వరకూ దిగొచ్చే అవకాశాలున్నట్లు స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ దశలో గోల్డ్‌పై పెట్టుబడి మరింత లాభదాయకమని సూచిస్తున్నారు.