అంతర్జాతీయ కారణాలతో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర రూ. 20 మేర తగ్గి.. రూ. 47,268 కు చేరింది.
అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో కిలో వెండి ధర రూ. 54 పెరిగి రూ. 49,584కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు ఔన్సుకు 1,709 యూఎస్ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర 17.68 యూఎస్ డాలర్లుగా ఉంది.
ఇదీ చదవండి: దేశంలో ఆన్లైన్ వీడియో వీక్షకుల సంఖ్య ఎంతంటే?