అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.418 పెరిగి రూ.52,963కు చేరింది.
వెండి కొనుగోలుపైనా మదుపరులు భారీగా ఆసక్తి కనబరిచారు. ఫలితంగా వెండి కిలోకు రూ.2,246 పైకెగిసి రూ.72,793కు పెరిగింది.
"అంతర్జాతీయ ధరల కారణంగా బంగారం ధర భారీగా పెరిగింది. అయితే రూపాయి బలపడడం వల్ల భారత్‌లో ఆ పెరుగుదల కొంత స్థాయికే పరిమితం అయింది" అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ తెలిపారు.
బలపడిన రూపాయి..
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 73 పైసలు బలపడి 72.86కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,988 డాలర్లకు పెరిగింది. వెండి కూడా స్వల్పంగా పెరిగి ఔన్సు ధర రూ.28.77 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: టెలికాం షేర్ల దూకుడుతో లాభాల్లో మార్కెట్లు