బంగారం ధరలు స్వల్పంగా పడిపోయాయి. దిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 118 తగ్గి.. రూ. 49,221కి చేరింది. అదే సమయంలో వెండి ధర సైతం తగ్గుముఖం పట్టింది. కిలో వెండి.. రూ. 875 పతనమై.. రూ.63,410కి చేరుకుంది.
టీకాపై ఆశలతో అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించిందని నిపుణులు పేర్కొన్నారు.
"ఈక్విటీ సూచీలు బలంగా పుంజుకోవడం వల్ల బంగారం ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఉద్దీపన పథకం ప్రకటనలు, బలహీనమైన డాలర్.. బంగారం ధరల పతనాన్ని అడ్డుకోవచ్చు."
-తాపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్
అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,860 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి 24.22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.