దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర బుధవారం రూ.717 తగ్గి.. రూ.46,102వద్దకు చేరింది.
వెండి ధర దిల్లీ మార్కెట్లో రూ.1,274 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.68,239 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సీనియర్ ఎనలిస్ట్ తపన్ పటేల్ వివరించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,786 డాలర్ల వద్ద, వెండి ఔన్సుకు 27.10 డాలర్ల వద్ద ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.