ETV Bharat / business

తెలంగాణలో కరోనా... స్టాక్​ మార్కెట్లు పతనం

తెలంగాణ, దిల్లీలో కరోనా వైరస్​ కేసులు నమోదైన వేళ.. స్టాక్​ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్​ ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి 939 పాయింట్లు పడిపోయింది. సెన్సెక్స్​ 153 పాయింట్లు, నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయింది.

stocks
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Mar 2, 2020, 3:43 PM IST

Updated : Mar 3, 2020, 4:15 AM IST

స్టాక్​ మార్కెట్లపై కరోనా వైరస్​ మరోసారి పంజా విసిరింది. ఉదయం నుంచి లాభాల్లో ట్రేడైన మార్కెట్లు.. దిల్లీ, తెలంగాణాలో కరోనా కేసుల వార్తల నేపథ్యంలో కుప్పకూలాయి. ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి 939 పాయింట్లు పడిపోయింది సెన్సెక్స్.

కరోనా భయాలతో దేశీయ మార్కెట్లు నష్టపోవడం వరుసగా ఇది ఏడో రోజు. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 153 పాయింట్లు నష్టపోయి 38,144 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 11,133కు చేరుకుంది.

ఇంట్రాడే సాగిందిలా..

వారాంతపు సెషన్​లో షేర్లు భారీగా పడిపోయిన కారణంగా ఇవాళ ఉదయం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఫలితంగా స్టాక్​ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఒకానొక దశలో 786 పాయింట్ల లాభంతో 39,083 పాయింట్లు గరిష్ఠాన్ని తాకింది సెన్సెక్స్​. నిఫ్టీ కూడా 11,433 పాయింట్లకు చేరుకుంది.

అయితే దిల్లీ, తెలంగాణలో రెండు కరోనా కేసులను నిర్ధరించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన ప్రకటన మదుపరులను భయపెట్టింది. ఫలితంగా.. ఒక్కసారిగా ఇంట్రాడే గరిష్ఠం నుంచి 1,300 పాయింట్ల మేర సెన్సెక్స్​ కుప్పకూలి 37,786 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 11,036 పాయింట్లు కనిష్ఠాన్ని తాకింది.

లాభనష్టాల్లో..

హెచ్​సీఎల్​ టెక్​, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, మహీంద్ర అండ్ మహీంద్ర, పవర్ గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ లాభపడ్డాయి.

ఎస్బీఐ, టాటా స్టీల్​, హీరోమోటోకార్ప్​, బజాజ్ ఆటో, ఓఎన్​జీసీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లన్నీ సోమవారం లాభాల్లో ముగిశాయి. ఇటీవల భారీగా పడిపోయిన షేర్ల కొనుగోలుకు మదపరులు ఆసక్తి చూపటం వల్ల షాంఘై, హాంకాంగ్​, దక్షిణ కొరియా, జపాన్​ మార్కెట్లు లాభపడ్డాయి.

ఐరోపా మార్కెట్లు కూడా లాభాల్లో సాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు పడిపోయాయి. బ్యారెల్​ క్రూడ్​ ధర 2.25 శాతం తగ్గి 50.79 బ్యారెళ్లకు చేరింది.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో​ ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు

Last Updated : Mar 3, 2020, 4:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.