దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. 41,700కు చేరువలో ఉన్న సెన్సెక్స్ ఒడుదొడుకుల్లో కొనసాగుతోంది. నిఫ్టీ ఎలాంటి లాభం లేకుండా 12,262 పాయింట్ల వద్ద ఉంది.
క్రిస్మస్, కొత్త సంవత్సరాదికి దేశీయ, ప్రపంచ మార్కెట్లకు సెలవుల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం.
లాభనష్టాల్లో..
రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరోమోటో కార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, ఓన్జీసీ, ఎస్ బ్యాంక్, ఎం అండ్ ఎం లాభాల్లో సాగుతున్నాయి.
హెచ్సీఎల్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో..
షాంఘై మినహా ఆసియా మార్కెట్లు నష్టాల్లో సాగుతున్నాయి. అమెరికాలోని వాల్ స్ట్రీట్ సోమవారం లాభాల్లో ముగిసింది.