ETV Bharat / business

Stock Markets: ఆర్థిక గణాంకాలు, ఫెడ్​ నిర్ణయమే కీలకం!

ఆర్థిక గణాంకాలు, వడ్డీ రేట్లపై ఫెడ్​ తీసుకునే నిర్ణయం..ఈ వారం దేశీయ మార్కెట్లను(Stock markets) ముందుకు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబరులో ఆటో అమ్మకాల లెక్కలపైనా మదుపరులు దృష్టిసారించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Market outlook
స్టాక్​ మార్కెట్ల అవుట్​లుక్​
author img

By

Published : Oct 31, 2021, 1:58 PM IST

వడ్డీ రేట్లపై ఫెడ్​ తీసుకునే నిర్ణయం, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు(macroeconomic data), ఆటో సేల్స్(auto sales india)​, సంస్థల త్రైమాసిక లాభాల ప్రకటన ఈ వారం స్టాక్​ మార్కెట్లకు(Stock markets) దిశా నిర్దేశం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు, దీపావళి పండగ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపి, మార్కెట్లు నష్టాల్లో కొనసాగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

"అక్టోబరులో పీఎంఐ సూచీ, అమెరికా ఫెడరల్​ బ్యాంకు సమావేశం దేశీయ మార్కెట్‌ కదలికలను కొంత ప్రభావితం చేస్తాయి."

- సిద్ధార్థ ఖేమ్కా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్

మదుపర్ల లాభాల స్వీకరణ, ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలత వల్ల గత వారం మార్కెట్ భారీ నష్టాలను నమోదు చేశాయి. ఈ వారం కూడా దీపావళి కారణంగా మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే అక్టోబరులో అంచనాల కంటే తక్కువ ఆటో అమ్మకాలు.. మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేస్తాయని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్​(పరిశోధన) సంతోష్​ మీనా పేర్కొన్నారు.

ఈ వారంలో దీపావళి పండగ కారణంగా మార్కెట్​కు రెండు రోజులు సెలవులు వచ్చాయి. గురువారం-దీపావళి లక్ష్మీపూజ, శుక్రవారం-దీపావళి బలిప్రతిపాద వేడుకలు జరగనున్నాయి. దీంతో ఈ వారంలో మూడు రోజులే ట్రేడింగ్ సెషన్‌ జరగనుంది.

ఇదీ చూడండి: పెట్రోల్​పై పన్నులతో ఖజానా ఫుల్- రాబడి 79 శాతం జంప్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.