ETV Bharat / business

ఈపీఎఫ్‌కు మార్కెట్‌ అండ- ఈక్విటీలపై మెరుగైన లాభాలు

author img

By

Published : Feb 17, 2022, 6:32 AM IST

EPFO stock market investments: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్​వో) స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి.. మెరుగైన లాభాలను సంపాదిస్తోంది. సంప్రదాయ పెట్టుబడులతో పాటు ఎక్స్ఛేంజ్‌ ట్రేడింగ్‌ ఫండ్స్‌ను కొనుగోలు చేసి.. లాభాలకు విక్రయిస్తోంది. వీటి ద్వారా వచ్చే ప్రతిఫలంతో వడ్డీరేటును నిర్ణయిస్తోంది.

EPFO stock market investments
EPFO stock market investments

EPFO stock market investments: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)కు స్టాక్‌మార్కెట్‌ అండగా నిలుస్తోంది. ఏడాదిన్నరగా మార్కెట్‌ పెరగడంతో ఆ మేరకు లాభాలు వస్తున్నాయి. ఈపీఎఫ్‌వో సంప్రదాయ పెట్టుబడులతో పాటు ఎక్స్ఛేంజ్‌ ట్రేడింగ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) నుంచి వచ్చే ప్రతిఫలంతో వడ్డీని నిర్ణయిస్తోంది. ఇప్పటికే మూడు దఫాలుగా మెరుగైన లాభాలతో ఈటీఎఫ్‌లను విక్రయించింది. 2017లో కొనుగోలు చేసిన ఈటీఎఫ్‌లను ఈ సంవత్సరం విక్రయించడంతో దాదాపు రూ.9వేల కోట్లకు పైగా లాభాలు వచ్చే అవకాశముందని అంచనా వేస్తోంది.

EPFO investments in equity:

ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మిగిలిన ఈక్విటీలు, బాండ్లపై డివిడెండ్‌లు బ్యాంకు నిల్వలపై వడ్డీలు, అందుబాటులోని మిగులు నిధులు, ఇతర ఖర్చులు అంచనా వేసి 2021-22 ఏడాదికి వడ్డీ రేటు ఖరారు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు మార్కెట్‌లో బాండ్ల రూపంలోని పెట్టుబడులపై అనిశ్చితి నెలకొంది. కొన్ని కంపెనీలు దివాలా తీయడంతో వాటి నుంచి నిధులు రాబట్టేందుకు న్యాయపరమైన ప్రయత్నాలు చేస్తోంది.

EPFO stock market investments
.

ఈక్విటీలో 8 శాతమే...

మెరుగైన లాభాల కోసం 5 శాతం ఈపీఎఫ్‌వో నిధులను స్టాక్‌మార్కెట్లో పెట్టాలని 2015లో కేంద్ర కార్మికశాఖ నిర్ణయించింది. ఆ తరువాత ఈ వాటాను 15 శాతానికి పెంచింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో నిధుల్లో 92శాతం బ్యాంకులు, ఇతర బాండ్ల రూపంలో ఉంటే, 8 శాతం మాత్రమే ఈక్విటీ మార్కెట్లో ఉన్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతోంది. 2015 నుంచి ఏటా ఈటీఎఫ్‌లు కొని, వాటిని మెరుగైన లాభాలతో విక్రయిస్తోంది.

EPFO stock market investments
.
  • 2017-18 ఏడాదిలో వడ్డీ చెల్లింపుల కోసం 2015లో కొనుగోలు చేసిన ఈటీఎఫ్‌లను విక్రయించగా రూ.1,011.82 కోట్ల లాభాలు వచ్చాయి. ఈ నిధులతో కలిపి చందాదారులకు 8.55శాతం వడ్డీ చెల్లించినా, మరో రూ.2,320 కోట్ల మిగులు నిధులున్నాయి.
  • 2018-19లో విక్రయించలేదు. ఆ యూనిట్లపై వచ్చిన డివిడెండ్లతో రూ.155 కోట్ల మిగులు తేలడంతో 8.65శాతం చొప్పున వడ్డీ ప్రకటించింది.
  • 2016లో కొన్న ఈటీఎఫ్‌లను 2019-20లో విక్రయించాలని భావించినా, మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రతిపాదన విరమించుకుంది.
  • 2020 డిసెంబరులో యూనిట్లు విక్రయించగా రూ.3,277.16 కోట్ల లాభం లభించింది. ఈ లాభం కారణంగా 2021 జనవరిలో రూ.954.62కోట్ల మిగులుతో 8.5శాతం చొప్పున వడ్డీ నిర్ణయించింది.
  • 2020-21లో 8.5 శాతం వడ్డీ ఖరారు చేసేందుకు 2017 జనవరి 1 నుంచి జూన్‌నెలాఖరు వరకు కొనుగోలు చేసిన యూనిట్లు 2021 మార్చిలోగా విక్రయించాలని నిర్ణయించింది. విక్రయంతో ఈపీఎఫ్‌వోకు రూ.4,072.83 కోట్ల లాభం వచ్చింది. ఇతర ఈటీఎఫ్‌లపై డివిడెండ్ల రూపంలో మరో రూ.3972.01 కోట్లు లభించాయి.
  • 2021-22 ఏడాదికి వడ్డీ చెల్లించేందుకు నాలుగోదఫా కింద 2017 జులై 1 నుంచి డిసెంబరు వరకు కొనుగోలు చేసిన ఈక్విటీలను విక్రయించాలని భావిస్తోంది. వీటితో కనీసం రూ.9వేల కోట్ల లాభం వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ యూనిట్ల విక్రయాన్ని ఈ ఏడాది మార్చి 31లోగా పూర్తి చేయనుంది.

ఇదీ చదవండి: 'ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందేది భారత ఆర్థిక వ్యవస్థే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.