స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్లో లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 254 పాయింట్లు బలపడి 51,279వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 76పాయింట్లు పెరిగి 15,174 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఐటీ షేర్లు లాభాల బాట పట్టాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 51,430 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,048 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,218 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,100 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
బజాజ్ ఫినాన్స్, సన్‌పార్మా, టెక్ మహేంద్ర, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాలను గడించాయి.
పవర్‌గ్రిడ్, ఓఎన్జీసీ, మారుతి, ఐటీసీ, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.