ETV Bharat / business

ఆర్థిక షేర్ల దూకుడు.. 51వేలు దాటిన సెన్సెక్స్ - market closing

స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 584 పాయింట్లు బలపడి 51,025వద్ద స్థిరపడింది. నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో 15,098 పైకి చేరింది. ఆర్థిక,ఐటీ షేర్లు లాభాలను గడించాయి. హెవీ వెయిట్​ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

economical shares and it shares are in positive node market cross 51k
ఆర్థికషేర్ల దూకుడు.. 51వేలు దాటిన సెన్సెక్స్
author img

By

Published : Mar 9, 2021, 3:41 PM IST

స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్​లో లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 584 పాయింట్లు బలపడి 51,025వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 142 పాయింట్లు పెరిగి 15,098 వద్ద స్థిరపడింది.

ఆర్థిక, ఐటీ షేర్ల సానుకూలతలు మార్కెట్​కు దన్నుగా నిలిచాయి. ఈ క్రమంలో సెన్సెక్స్​ 51 వేల మార్కును తాకింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 51,111 పాయింట్ల అత్యధిక స్థాయి, 50,396 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,126 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,925 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

కోటక్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, ఏషియన్​ పెయింట్స్​, టీసీఎస్​, టెక్​మహేంద్ర షేర్లు లాభాలను గడించాయి.

పవర్​గ్రిడ్, ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్​, డా.రెడ్డీస్​, సన్​ఫార్మా షేర్లు నష్టపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.