ETV Bharat / business

ద్రవ్యోల్బణం భయాలతో మార్కెట్లకు భారీ నష్టాలు - బొంబాయి స్టాక్​ ఎక్సేంజి

దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 397 పాయింట్లు కోల్పోయి 50,395 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 101 పాయింట్లు క్షీణించి 14,929 వద్దకు చేరింది.

due to Inflation fears market indicators in losses
ద్రవ్యోల్బణ భయాలతో నష్టాల్లో సూచీలు
author img

By

Published : Mar 15, 2021, 3:39 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్​లో నష్టాల్లో ముగిశాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌ కీలకమైన 50 వేల పాయింట్ల మార్క్‌ను.. నిఫ్టీ 15,000 మార్క్‌ను కోల్పోయాయి. బొంబాయి స్టాక్​ ఎక్సేంజి సూచీ సెన్సెక్స్ 397 పాయింట్లు పతనమైంది. చివరకు 50 వేల 395 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 101 పాయింట్లు పడిపోయి 14 వేల 929 వద్ద సెషన్​ను ముగించింది.

బ్యాకింగ్‌, ఆర్థిక రంగాల్లోని షేర్ల అమ్మకాలు వెల్లువెత్తగా సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లలో చాలా సూచీలు నష్టాల్లో పయనిస్తుండడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. తాజాగా వెలువడిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ డబ్ల్యూపీఐ వరుసగా రెండో నెలా ఎగబాకింది. దీంతో మదుపరులు అమ్మకాలకు దిగారు.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు సూచీలపై ప్రభావం చూపాయి.
ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,834 అత్యధిక స్థాయిని; 49,799 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 15,048 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,745 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభాల్లో ​

పవర్​గ్రిడ్​, టెక్​ మహేంద్ర, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​, ఎన్​టీపీసీ, టైటాన్​, టీసీఎస్​, నెస్లే, ఎస్​బీఐ ఇండియా లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో

బజాజ్​ ఫెన్సెర్వ్​​, బజాజ్​ ఫైనాన్స్​, బజాజ్​ ఆటో, ఏషియన్​ పెయింట్స్​, ఎల్​ అండ్​ టీ, ఓఎన్​జీసీ, రిలయన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎం అండ్​ ఎం, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ నష్టాలు మూటగట్టుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.