ETV Bharat / business

లాక్​డౌన్ పొడిగింపు అనుమానాలతో మార్కెట్లు డీలా

author img

By

Published : Apr 13, 2020, 4:53 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం సహా దేశంలో లాక్​డౌన్​ కొనసాగిస్తారన్న అనుమానాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలు చవిచూశాయి. 470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 30,690 వద్ద ట్రేడింగ్ ముగించింది. 118 పాయింట్ల నష్టపోయిన నిఫ్టీ.. 9 వేల మార్క్​ దిగువన స్థిరపడింది.

stock markets etv bharat
స్టాక్ మార్కెట్లు

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావంతో దేశీయ మార్కెట్లు డీలా పడ్డాయి. దేశంలో లాక్​డౌన్ కొనసాగిస్తారన్న అనుమానాలు, హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్​ల షేర్లు తీవ్రంగా పతనమవడం వల్ల స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

ఇవాళ్టి ట్రేడింగ్​లో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 470 పాయింట్లు కోల్పోయింది. చివరకు 30,690 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివివే

సెన్సెక్స్​లోని 30 షేర్లలో బజాజ్ ఫైనాన్స్ 10 శాతానికి పైగా నష్టపోయింది. హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుల షేర్లు 3.12 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 3.44 శాతం పతనమయ్యాయి. మహీంద్ర అండ్ మహీంద్ర, టైటాన్, హీరో మోటో కార్ప్, ఐసీఐసీఐ, టెక్ మహీంద్ర కంపెనీల షేర్లు సైతం నష్టాలబాట పట్టాయి.

ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్​టెల్, ఇండస్​ఇండ్ బ్యాంక్, అల్ట్రా టెక్ సిమెంట్, ఎన్​టీపీసీ షేర్లు లాభాల్లో పయనించాయి.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ.. 118 పాయింట్లు క్షీణించి 8,994 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

అంతర్జాతీయ మార్కెట్లు

ఆసియా మార్కెట్లు సైతం తీవ్రంగా నష్టపోయాయి. షాంఘై, టోక్యో, సియోల్ స్టాక్ ఎక్స్ఛేంజీలు భారీ నష్టాలు చవిచూశాయి. ఈస్టర్ మండే కారణంగా ఐరోపాలో మార్కెట్లు తెరుచుకోలేదు.

రూపాయి

ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి మారకం ధర 76.27గా ఉంది.

ముడి చమురు

ముడి చమురు ధర 2.06శాతం తగ్గింది. బ్యారెల్ ముడి చమురు ప్రస్తుతం 30.8. డాలర్లకు చేరుకుంది. అంతకుముందు రష్యా, సౌదీ అరేబియా మధ్య కీలక ఒప్పందం ఖరారు కావడం వల్ల ఓ దశలో చమురు ధర భారీగా పెరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.