టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 8 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 7.39 శాతాన్ని తాకింది. ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.17 శాతంగా నమోదైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ముడి చమురు, లోహ ధరల్లో వృద్ధి టోకు ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో పెరిగేందుకు కారణమని ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఇంతకు ముందు 2012 అక్టోబర్లో టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 7.4 శాతంగా నమోదైంది.
ఆర్థిక శాఖ వెల్లడించిన మరిన్ని విషయాలు..
ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం ఈ ఏడాది మార్చిలో 3.24 శాతంగా నమోదైంది. పప్పు ధాన్యాలు, పండ్లు, వరి ధరలు భారీగా పెరిగాయి.
కూరగాయల ధరలు మార్చిలో -5.19గా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఇవి -2.90 శాతంగా ఉండటం గమనార్హం.
పప్పు ధాన్యాల టోకు ద్రవ్యోల్బణం గత నెల 13.14, పండ్ల ద్రవ్యోల్బణం 16.33 శాతంగా నమోదైంది
ఇంధన, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం మార్చిలో వరుసగా.. 10.25 శాతం, 0.58 శాతంగా నమోదైంది.
ఇదీ చదవండి:అందుబాటు ధరలకు ఎరువులు- కేంద్రం హామీ